: ఆ నివేదికను అమలు చేసినప్పుడే శివరామకృష్ణన్ కు నిజమైన నివాళి: జగన్
ఏపీ రాజధాని ఎంపిక కమిటీకి నాయకత్వం వహించిన శివరామకృష్ణన్ మృతి పట్ల వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. శివరామకృష్ణన్ మృతికి తన సంతాపం తెలిపారు. ఆయన నేతృత్వంలోని కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. శివరామకృష్ణన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.