: వివక్ష చూపిన బ్రిటన్ విద్యార్థిని చితకబాదిన సిక్కు కుర్రాడు
తనపై నిత్యమూ జాతి వివక్ష చూపుతున్న ఓ బ్రిటన్ విద్యార్థి ఆగడాలను ఆ సిక్కు కుర్రాడు సహించలేకపోయాడు. నడిరోడ్డుపై మరోసారి వేధిస్తున్న అతడిని చితకబాదాడు. ఈ ఘటనను కొందరు విడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీనికిప్పుడు వేలాది క్లిక్స్ వస్తున్నాయి. ఈ ఘటన బ్రిటన్ లోని ఓ స్కూలు ముందు జరిగింది. బ్రిటన్ యువకుడిని కొట్టే ముందు సిక్కు కుర్రాడు తనను వేధించవద్దని, దీన్ని తక్షణం ఆపివేయాలని పలుమార్లు కోరాడు. అయినా వినిపించుకోకపోవడంతో కోపాన్ని ఆపుకోలేక పిడిగుద్దులు మొదలు పెట్టాడు. రోడ్డుపై కింద పడేసి కొట్టాడు. ఆపై కొడుతూ, తరుముకుంటూ వెళ్లాడు. ఈ ఘటనలో ఇంతవరకూ పోలీసులు స్పందించారా? లేదా? అన్న విషయం తెలియరాలేదు.