: రూ. 400 కోట్లతో ఎన్టీఆర్ చీర, ధోవతి కార్యక్రమం: చంద్రబాబు

ఎన్టీఆర్ చీర, ధోవతి కార్యక్రమాన్ని మళ్లీ ప్రవేశపెడతామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమం కోసం రూ. 400 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం కేవలం ప్రజలకే కాకుండా, చేనేత కార్మికులకు కూడా చేయూతను అందించేలా ఉంటుందని చెప్పారు. అలాగే, గోదావరి పుష్కర ఘాట్ వద్ద శ్రీకృష్ణుడి వేషంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. మహానాడు వేదికపై ప్రసంగిస్తూ చంద్రబాబు ఈ విషయాలను వెల్లడించారు.

More Telugu News