: ఆరేళ్ల తరువాత సెంచరీ చేసిన భర్తకు 'ముబారక్...' అంటూ సానియా అభినందన
దాదాపు ఆరు సంవత్సరాల తరువాత ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లో సెంచరీ సాధించిన తన భర్త షోయబ్ మాలిక్ కు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ట్విట్టర్ మాధ్యమంగా అభినందనలు తెలిపింది. 'ముబారక్...' అంటూ ట్వీట్ చేసింది. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ని పాక్ జట్టు 41 పరుగుల తేడాతో గెలుచుకున్న సంగతి తెలిసిందే. కాగా, 2003 జూన్ లో, చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియాపై వన్డే ఆడిన తరువాత జట్టుకు దూరమైన మాలిక్ చాలాకాలం తర్వాత తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. ఆరేళ్ల తర్వాత మళ్లీ సెంచరీ చేసి తన సత్తా చాటాడు. మాలిక్ ఫామ్ లోకి రావడం, సెంచరీ చేయడంతో తనకెంతో ఆనందంగా ఉందని సానియా ట్వీట్ చేసింది.