: బాంబు పేలుతుందని కిలోమీటర్ దూరంలోని 20,000 మందిని ఖాళీ చేయించారు

బాంబు పేలుతుందని భయపడి కిలోమీటర్ దూరంలోని 20 వేల మందిని ఖాళీ చేయించిన ఘటన జర్మనీలో చోటుచేసుకుంది. రెండో ప్రపంచ యుద్ధంనాటి గుర్తులు ఇంకా జర్మనీని వీడలేదు. యుద్ధ కాలంలో ఉపయోగించిన పేలని శక్తిమంతమైన ఓ భారీ బాంబు కోల్గెనో పట్టణంలో తవ్వకాల్లో బయటపడింది. ఇది పేలుతుందేమోనని భయపడ్డ ప్రభుత్వం తక్షణం బాంబుకు కిలోమీటర్ దూరంలో ఉన్న 20,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలిస్తోంది. స్థానికులను తరలించేందుకు వందలాది మంది పోలీసు, అగ్నిమాపక దళాలు ప్రయత్నిస్తున్నాయి. రెండో ప్రపంచయుద్ధం తరువాత భారీ సంఖ్యలో ప్రజలను తరలించడం ఇదే ప్రథమం అని స్థానికులు చెబుతున్నారు. కాగా, బాంబును నిర్వీర్యం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పొరపాటున ఇది పేలితే భారీ నష్టం తప్పదని వారు అభిప్రాయపడుతున్నారు.

More Telugu News