: ఇదెక్కడి విడ్డూరం? గెలిచిన వ్యక్తి ఓడిన వ్యక్తిని అభివృద్ధి చేయమంటున్నారు?: స్మృతీ ఇరానీ
గెలిచిన వ్యక్తి ఓడిన వ్యక్తిని నియోజకవర్గం అభివృద్ధి చేయమంటున్నారు, ఇదెక్కడి విడ్డూరం? అని కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తనపై ప్రియాంక గాంధీ చేసిన విమర్శలపై మంత్రి ఢిల్లీలో స్పందించారు. "నాయకత్వ లోపం తెలుసుకునే రాహుల్ తన సోదరిని రక్షణగా తెచ్చుకున్నారా?" అని ఆమె అన్నారు. ప్రియాంక అయినా పూర్తి కసరత్తు చేసి అమేథీలో అడుగుపెట్టాల్సిందని ఆమె సూచించారు. అమేథీలో ఇప్పటికే అలహాబాద్ కు చెందిన ట్రిపుల్ ఐటీ బ్రాంచ్ ఉందని ఆమె గుర్తు చేశారు. మరో ట్రిపుల్ ఐటీ ఎలా వస్తుందని ఆమె ప్రశ్నించారు. ఆరు దశాబ్దాలుగా తమకు పెట్టని కోటగా ఉన్న అమేథీని అభివృద్ధి చేయని కాంగ్రెస్, ఓడిపోయిన తనను అభివృద్ధి చేయాలంటూ అడుగుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు.