: ఆ చరిత్ర అంతా కేసీఆర్ సొంత డబ్బాలా ఉంది: ఉత్తమ్ కుమార్

ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైందంటూ రాష్ట్ర పదవ తరగతి సాంఘిక శాస్త్రంలో పేర్కొనడంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ చరిత్ర అంతా కేసీఆర్ సొంత డబ్బాలా ఉందని ధ్వజమెత్తారు. తెలంగాణ ఇచ్చిన తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాష్ట్రం కోసం పోరాడిన ప్రొ.జయశంకర్, బలిదానాలు చేసిన అమరవీరుల పేర్లు ఎక్కడా ప్రస్తావించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. భావితరాలను తప్పుదారి పట్టించేలా పాఠ్య పుస్తకాలున్నాయని ఉత్తమ్ పేర్కొన్నారు.

More Telugu News