: మహానాడులో పోలీసులతో బాలకృష్ణ వాగ్వాదం
కారును వీఐపీ పార్కింగ్ వద్ద నిలిపేసి మహానాడు ప్రాంగణానికి నడిచి వెళ్లాలని పోలీసులు చేసిన సూచనపై హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ మండిపడ్డారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన ఆయన, వారి మాటలను లక్ష్యపెట్టక మహానాడు మెయిన్ గేటు వరకూ కారులో వెళ్లారు. ఎవరితో ఏం మాట్లాడుతున్నావని అక్కడున్న ఓ పోలీసు అధికారిని ఆయన గద్దించినట్టు తెలుస్తోంది. అనంతరం ఆయన మాట్లాడుతూ, అభిమానులు, కార్యకర్తల సంఖ్య అధికంగా ఉండడం, తనకు రక్షణగా ఎక్కువ మంది లేకపోవడంతోనే కారును మెయిన్ గేటు వరకూ తీసుకెళ్తున్నట్టు పోలీసులకు చెప్పానే తప్ప ఎవరినీ తిట్టలేదని అన్నారు.