: ఉగ్రవాదంతో లింకుంటే పౌరసత్వం తొలగింపు: ఆస్ట్రేలియా
సిడ్నీ కేఫ్ ఉదంతంతో మేల్కొన్న ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టాలకు పదునుపెడుతోంది. ఉగ్రవాదంతో ఎలాంటి లింకున్నా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్న వారికి ఆస్ట్రేలియా పౌరసత్వం లేకుండా చేయాలని భావిస్తోంది. ఈ దిశగా చట్టాలను సవరిస్తోంది. ఉగ్రవాదులతో స్నేహం కొనసాగించినా, ఉగ్రవాదులతో సంబంధాలు నెరపినా ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారి పౌరసత్వం తొలగించనున్నామని ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబ్బాట్ తెలిపారు.