: కడియం శ్రీహరితో మంత్రి గంటా భేటీ

తెలంగాణ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరితో ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ అయ్యారు. తెలంగాణ సచివాలయంలోని కడియం చాంబర్ లో వారిద్దరూ సమావేశమయ్యారు. ఇందులో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. గవర్నర్ నరసింహన్ సూచన మేరకు సమావేశమైన మంత్రులు ఏపీ ఎంసెట్ కౌన్సెలింగ్ కు సహకారం, ఉన్నత విద్యామండలి అంశం, రికార్డులు, సిబ్బంది కేటాయింపుపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ ఉదయం గవర్నర్ ను కలసిన ఇద్దరు మంత్రులకు, ప్రత్యేకంగా సమావేశమై సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలని నరసింహన్ సూచించారు.

More Telugu News