: ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ వచ్చే అవకాశం ఉంది: కంభంపాటి హరిబాబు
ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ వచ్చే అవకాశం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు తెలిపారు. అభివృద్ధిలో భాగంగా రైల్వే జోన్ కేటాయింపు ఉంటుందని చెప్పారు. ఈ మేరకు విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ రాజధానికి కేంద్రం నిధులిస్తుందని, అయితే ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం నిర్ణయం తీసుకునే వరకు తానెలాంటి వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. బీజేపీ తీసుకున్న చొరవవల్లే ఏపీకి మిగులు విద్యుత్ ఉందన్న కంభంపాటి, బందర్ పోర్టు నిర్మాణం జరిగితే విజయవాడ అభివృద్ధి చెందుతుందని ఉద్ఘాటించారు.