: వ్యాయామం చేస్తూ గాయపడ్డ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి ఈ ఉదయం వ్యాయామం చేస్తూ పట్టుతప్పారు. ట్రెడ్ మిల్ పై ఎక్సర్ సైజు చేస్తుండగా, ఆమె జారి కిందపడ్డారని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆమె చేతి మణికట్టుకు గాయం అయింది. వెంటనే స్పందించిన ఇంట్లోని వారు ఆమెను అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ మధ్యాహ్నం ఆమెకు అపోలో వైద్యులు శస్త్రచికిత్స చేయనున్నట్టు తెలుస్తోంది. భువనేశ్వరిని ఫోన్లో ఆమె కుటుంబసభ్యులు పరామర్శించారు. చంద్రబాబు అపోలో ఆసుపత్రికి బయలుదేరారు.

  • Loading...

More Telugu News