: ఒకే కాన్పులో నలుగురికి జన్మనిచ్చిన 65 ఏళ్ల నానమ్మ
ఆమె పేరు అనెగ్రెట్ రౌనిగ్. 13 మంది సంతానం. వారికీ ఉన్న సంతానం లెక్కతీస్తే ఇంకెంతో మంది! అయితేనేం, తనకింకా పిల్లలు కావాలని భావించింది. ఉక్రెయిన్ లోని ఓ ఆసుపత్రిలో ఫెర్టిలిటీ సేవలు తీసుకుంది. ఈ సేవలందుకున్న అత్యధిక వయసున్న మహిళగా రికార్డు సృష్టించడమే కాకుండా నలుగురు పిల్లల్ని కన్నది. బెర్లిన్ లోని ఓ ఆసుపత్రిలో ఆమెకు శస్త్రచికిత్స చేసిన వైద్యులు ముగ్గురు మగ, ఓ ఆడశిశువును బయటకు తీశారు. నెలలు పూర్తిగా నిండకుండానే కాన్పు చేయాల్సి వచ్చిందని, చిన్నారులతా 655 గ్రాముల నుంచి 960 గ్రాముల మధ్య ఉన్నారని, వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈమె బెర్లిన్ లో ఇంగ్లీష్, రష్యన్ భాషలు బోధిస్తున్న టీచరుగా విధులు నిర్వహిస్తోంది. ఒకే కాన్పులో నలుగురిని కన్న అత్యధిక వయస్కురాలు కూడా ఈమేనట.