: విశాఖ జిల్లాలో ప్రేమికుల ఆత్మహత్య
వారిద్దరూ ప్రేమించుకున్నారు. కలసి జీవితం గడపాలని భావించారు. కానీ, పెళ్లికి పెద్దల అడ్డు తగిలింది. తమ వివాహానికి పెద్దలు అంగీకరించ లేదన్న కారణంతో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణ ఘటన విశాఖపట్నం జిల్లా అనకాపల్లి సమీపంలో జరిగింది. గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న కె.అప్పారావు, సీహెచ్ దుర్గాలక్ష్మిలు అనకాపల్లి దగ్గరున్న ఏలేరు కాలువలో దూకి ప్రాణాలు విడిచారు. నీటి ప్రవాహానికి ఇరువురి మృతదేహాలూ కొట్టుకుపోయాయి. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.