: ఫెదరర్ తో సెల్ఫీ కోసం అభిమాని సాహసం


ఫ్రెంచ్ ఓపెన్ పోటీల ప్రారంభం రోజునే భద్రతా పరమైన లోపాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి. స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తో సెల్ఫీ దిగాలన్న అత్యుత్సాహంతో ఓ అభిమాని రక్షణ వలయాలను తప్పించుకుని మైదానంలోకి దూసుకొచ్చాడు. భద్రతా సిబ్బందికి ముచ్చెమటలు పట్టించాడు. మైదానంలోకి దూసుకొచ్చిన ఆ అభిమాని, ఫెదరర్ తో కలిసి నడుస్తూ, సెల్ఫీ దిగేందుకు యత్నించాడు. దీంతో ఫెదరర్ సైతం కాస్తంత ఆందోళనకు గురయ్యాడు. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది అప్రమత్తమై అతడిని దూరంగా తీసుకువెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News