: సముద్రంలో చిక్కుకుపోయిన వారిని ఆదుకోండి: పోప్ పిలుపు
నడి సముద్రంలో చిక్కుకుపోయిన రోహింగ్యా ప్రజలను ఆదుకోవాలని రోమన్ క్యాథలిక్కుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. ఆకలితో అలమటిస్తున్న రోహింగ్యాలు బంగాళాఖాతం, అండమాన్ సముద్రం దాటేందుకు మద్దతు పలకాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి సూచించారు. బంగ్లాదేశ్, మయన్మార్ లో మైనారిటీలుగా పరిగణించబడుతున్న రోహింగ్యాలు, అక్కడి నిర్లక్ష్యాన్ని భరించలేక, ఇండోనేషియా, మలేషియాలకు వలస వెళ్లిపోతున్నారు.