: అశ్లీల చిత్రాలు తీసి వేధింపులు... పోలీసులకు లేఖ రాసి, వివాహిత ఆత్మహత్య
పెళ్లయిన ఓ యువతి చిత్రాలను రహస్యంగా తీసి తరచూ వేధిస్తుండడంతో, 'తాను ఆత్మహత్య చేసుకుంటున్నా'నని పోలీసులకు లేఖ రాసి తనువు చాలించింది ఓ వివాహిత. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, చెంచులిపేటకు చెందిన పండా ఉష అనే వివాహితకు చెందిన ఫోటోలను గువ్వల బాలాజీ అలియాస్ బాలు అనే యువకుడు, అతడి మిత్రులు సెల్ ఫోన్ లో తీశారు. వాటిని చూపుతూ ఆమెను వేధించారు. వేధింపులు భరించలేని ఆమె ఆదివారం ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు పోలీసులకు లేఖ రాసింది. బాలరాజు, అతడి స్నేహితులు తనను మానసికంగా వేధించారని ఆ లేఖలో వివరించింది. లేఖ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.