: నేపాల్ లో వరదల భయం... ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేస్తున్న ప్రజలు
నేపాల్ పై ప్రకృతి పగ ఇంకా వీడలేదు. గత అర్ధరాత్రి మ్యాగ్దీ జిల్లాలోని కాళీ గండకీ నదిలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో నదీ ప్రవాహం నిలిచి పైతట్టు ప్రాంతాల్లో 150 మీటర్లకు పైగా నీటిమట్టం పెరిగింది. సమీప ప్రాంతాల్లో వేలాదిమంది ప్రజలు ఏ క్షణమైనా భారీ వరదలు వస్తాయని తీవ్ర భయాందోళనలకు గురై ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేస్తున్నారు. కొండచరియలను చీల్చుకొని నది ముందుకు దూకిన పరిస్థితుల్లో ప్రభావం పడే ప్రాంతంలోని 100 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, సమీప గ్రామాలకు ప్రమాదం లేకపోయినా, ప్రజలు వారంతట వారే వెళ్లిపోయారని అధికారులు వివరించారు. కొండచరియలు విరిగిపడిన కారణంగా ఎటువంటి ప్రాణ నష్టమూ జరగలేదని తెలిపారు.