: ఆదివారం సెలవు తీసుకోని జయలలిత
నిన్న తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జయలలిత నేడు సెక్రటేరియట్ కు వచ్చి కార్యకలాపాలు మొదలుపెట్టనున్నారు. నేడు సెలవు తీసుకోరాదని భావిస్తున్న ఆమె రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని 'అమ్మ క్యాంటీన్'లను ప్రారంభిస్తారని తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆమె సచివాలయానికి వస్తారని ఏఐఏడీఎంకే పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆమెకు ఘనస్వాగతం పలికేందుకు సెక్రటేరియట్ ఉద్యోగులు, పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. 67 ఏళ్ల జయలలిత నిన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆమె, ఆ శిక్షను పైకోర్టు రద్దు చేయడంతో తిరిగి బాధ్యతలు చేపట్టారు.