: ఒక్క సంవత్సరంలో 100 మంది ఉద్యోగులను కోటీశ్వరులను చేసిన ఇన్ఫోసిస్


గడచిన సంవత్సర కాలంలో ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్న కోటీశ్వరుల సంఖ్య 18 నుంచి 113కు పెరిగింది. 2014-15లో మొత్తం 113 మందికి కోటి రూపాయలకు పైగా వేతనం అందింది. 2013-14లో ఈ సంఖ్య 18 మాత్రమే. ఇదే సమయంలో రూ. 60 లక్షలకు పైగా జీతం తీసుకుంటున్న వారి సంఖ్య 72 నుంచి 202కు పెరిగింది. చాలా మంది ఉద్యోగుల వేతనాలను ఇన్ఫీ యాజమాన్యం గణనీయంగా పెంచింది. ఇన్ఫోసిస్ వార్షిక నివేదిక వెల్లడించిన వివరాల ప్రకారం అందరు వైస్ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యగుల సరాసరి వేతనం రూ. 1.5 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకూ పెరిగింది. కాగా, ఇన్ఫీకి పోటీగా ఉన్న విప్రోలో 2013-14 లెక్కల ప్రకారం 36 మందికి రూ.1 కోటికి పైగా వేతనం లభించింది. ఈ సంస్థ తాజా గణాంకాలు వెల్లడి కావాల్సి వుంది.

  • Loading...

More Telugu News