: ఏపీకి ప్రత్యేక హోదా వ్యతిరేకించిన ఎంపీ గుత్తా... ఇస్తే తెలంగాణకు నష్టమని వాదన

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఏపీకి మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని, ఇక్కడి నుంచి పరిశ్రమలు ఏపీకి తరలివెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాజధాని మినహా మిగిలిన అన్ని విషయాలలో తెలంగాణ కన్నా ఏపీ పరిస్థితి చాలా బాగుందని గుత్తా వ్యాఖ్యానించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆయన లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ అధిష్ఠానం సహా కోరుతుంటే గుత్తా వ్యతిరేకించడం గమనార్హం. అంతేగాక తెలంగాణ ఉద్యమ కేంద్రంగా ఉన్న ఉస్మానియా వర్శిటీ స్థలాలను ప్రభుత్వం తీసుకోవాలనుకోవడం సరికాదన్నారు.

More Telugu News