: మద్యానికి కొరత లేని రాష్ట్రంగా ఏపీ!
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇకపై మద్యానికి కొరత లేని రాష్ట్రంగా అవతరించనుంది. ఇప్పటికే రాష్ట్రంలో 14 మద్యం తయారీ కంపెనీలు ఏడాడికి 1221.58 లక్షల ప్రూఫ్ లీటర్ల మద్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. తాజాగా నాలుగు డిస్టిలరీలకు అదనంగా ఏడాదిలో 873 లక్షల ప్రూఫ్ లీటర్ల ఉత్పత్తికి అనుమతి ఇచ్చిందని సమాచారం. తద్వారా రాష్ట్రంలో మద్యం సరఫరాకు కొరత ఉండకుండా చూడాలనేది ఏపీ ప్రభుత్వ ఆలోచన. లోటు బడ్జెట్ తో ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే, మద్యం అమ్మకాలపై కూడా దృష్టి సారించినట్టు సమాచారం.