: టీమిండియా జట్టు కోచ్ గా గంగూలీనే బెస్ట్ అంటున్న లిటిల్ మాస్టర్!

టీమిండియా కోచ్ గా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ మెరుగ్గా రాణించే అవకాశాలున్నాయని అలనాటి మేటి దిగ్గజం లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. గంగూలీ అనుభవం ప్రస్తుత జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నాడు. భారత జట్టు హెడ్ కోచ్గా లేదా టీమ్ డైరెక్టర్గా ఏ పదవిలో నియమించినా గంగూలీ పూర్తి న్యాయం చేస్తాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. డంకెన్ ఫ్లెచర్ స్థానంలో కొత్త కోచ్ను నియమించేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పదవికి గంగూలీ సహా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా కోచ్ పదవికి గంగూలీయే ఉత్తమమని గవాస్కర్ అన్నాడు. 'భారత్ ఆడబోయే మ్యాచ్లు ఎక్కువగా స్వదేశంలో, ఉపఖండంలో ఉన్నాయి. జట్టు కోచ్ పదవిలో గంగూలీని నియమిస్తే జట్టును సమర్థవంతంగా నడిపిస్తాడు. దాదా కోచ్ అయితే జట్టుకు ఇతర కోచ్ల అవసరం ఉండదు' అని గవాస్కర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. టీమిండియా కోచ్ పదవికి ఇటీవల గంగూలీ పేరు వినిపిస్తున్నా.. అతడు తన అభిప్రాయాన్ని మాత్రం వెల్లడించలేదు.

More Telugu News