: సూర్య 'రాక్షసుడు' ఆడియో లాంచ్ షురూ
సూర్య, నయనతార, ప్రణీత నటించిన 'రాక్షసుడు' ఆడియో ఆవిష్కరణ వేడుకకు హైదరాబాదులోని శిల్పకళావేదిక వేదికగా నిలిచింది. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. తమిళంలో 'మాస్' పేరుతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే హల్ చల్ చేస్తోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ సమర్పణలో ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు. ఇందులో సూర్య పాత్ర డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాను మే 29న రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.