: నాసిక్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం... ఐదుగురు డాక్టర్ల దుర్మరణం
మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు డాక్టర్లు దుర్మరణం చెందారు. ముంబై-ఆగ్రా హైవేపై ఈ దుర్ఘటన జరిగింది. ఆరుగురు వైద్యులు ఓ కార్యక్రమానికి హాజరై పింపల్ గావ్-బస్వంత్ కు తిరిగివస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో, ఐదుగురు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. మరణించిన వారిని సంజయ్ తివారి (45), ప్రతాప్ షెల్కే (47), చంద్రశేఖర్ గంగూర్డే (47), కుందన్ జాదవ్ (38), సూరజ్ పాటిల్ (39) గా గుర్తించారు. గాయపడిన ఉమేశ్ భోసాలే అనే వైద్యుడిని నాసిక్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కారును ఢీకొట్టిన వాహనం కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.