: గున్న ఏనుగు జంపింగ్... హోసూరు హైవేపై ముచ్చట!


భారీ కాయంతో ఉండే గజరాజుకు దారిలో ఏదైనా అడ్డొస్తే, కాస్త దూరమైనా చుట్టూ తిరిగి చిన్నగా వెళ్లిపోతుంది. చిన్న జంతువుల్లాగా జంపింగ్ లు ఏనుగులకు సాధ్యం కాదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే నిన్న హోసూరు హైవేపై కొయంబత్తూరు జిల్లా మధుకరై వద్ద ఓ దృశ్యాన్ని చూసిన ప్రజలు నిశ్చేష్టులయ్యారు. ఆ దృశ్యం ఏంటంటే, ఓ గున్న ఏనుగు రోడ్డు మధ్యలోనున్న డివైడర్ ను జంప్ చేసి ఎంచక్కా వెళ్లిపోయింది. కొందరు ఈ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించేశారు. సదరు దృశ్యాన్ని నేడు ఓ తెలుగు దినపత్రిక ప్రముఖంగా ప్రచురించింది.

  • Loading...

More Telugu News