: చేతిలో చెయ్యేసి... బెంగళూరులో తళుక్కుమన్న కోహ్లీ, అనుష్క శర్మ!

టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలు మరోసారి తళుక్కుమన్నారు. అది కూడా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో. నిన్న కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిన ఈ మ్యాచ్ లో ఇరు జట్లకు చెరో పాయింట్ దక్కింది. అయితే రన్ రేట్ లో మెరుగైన స్థితిలో ఉన్న బెంగళూరు ప్లే ఆఫ్ కు చేరగా, ఢిల్లీ నిరాశతో ఇంటికి చేరింది. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు కోహ్లీ గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మ ముంబై నుంచి ప్రత్యేకంగా వచ్చింది. మ్యాచ్ ముగిసిన అనంతరం డ్రెస్సింగ్ రూంలోకి వెళుతున్న కోహ్లీని అనుష్క శర్మ ఆపేసింది. కోహ్లీ చేతిని తన చేతుల్లోకి తీసుకుని కంగ్రాట్స్ చెప్పింది. దీనికి కోహ్లీ కూడా నవ్వుతూ ఆసక్తిగా అనుష్కతో ఏదో చెప్పాడు. ఈ దృశ్యం చిన్నస్వామి స్టేడియానికి వచ్చిన క్రికెట్ అభిమానులకు కనువిందు చేసింది.

More Telugu News