: అసభ్య నృత్యాలు చేశాడని దుర్గ గుడి అర్చకుడి తొలగింపు

పరమ పవిత్రమైన అర్చక వృత్తిలో ఉంటూ అసభ్య నృత్యాలు చేస్తూ దొరికిపోయాడో పూజారి. ఆ వెంటనే సస్పెన్షన్ కు గురయ్యాడు. వివరాల్లోకి వెళితే, విజయవాడ కనకదుర్గ గుడిలో అర్చకుడిగా చెరువు కాశీవిశ్వనాథ్ పనిచేస్తున్నాడు. ఇటీవలి హనుమాన్ జయంతి పర్వదినం నాడు గుంటూరు జిల్లా సీతానగరంలో ఏర్పాటు చేసిన ఓ స్టేజ్ షోలో విశ్వనాథ్ పాల్గొన్నాడని, అసభ్య నృత్యాలు చేశాడని సమాచారం. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఈఓ విచారణ జరిపించి ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేల్చారు. తక్షణం విశ్వనాథ్ ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించారు.

More Telugu News