: పేద మంగోలియాకు మోదీ వితరణ... రూ. 6,300 కోట్ల సాయం

అభివృద్ధికి దూరంగా, మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్న మంగోలియాపై భారత ప్రధాని నరేంద్ర మోదీ కరుణ చూపారు. మంగోలియా ప్రధాని సైకెన్ బిలేగ్ తో సమావేశమైన ఆయన బిలియన్ డాలర్లు (సుమారు రూ. 6,300 కోట్లు) సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. చైనా పర్యటనను ముగించుకుని మంగోలియా చేరుకున్న ఆయనకు గత రాత్రి ఘన స్వాగతం లభించింది. ఇరు దేశాల మధ్యా కీలక ఒప్పందాలు కుదిరాయి. పౌర, అణు ఇంధన రంగాల్లో ఇరు ప్రధానుల సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు. మంగోలియాలో వివిధ విభాగాల్లో మౌలిక వసతుల రూపకల్పనకు సాయపడతామని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు. కాసేపట్లో ఆయన మంగోలియా పార్లమెంటులో ప్రసంగించనున్నారు. కాగా, మంగోలియాలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీయే కావడం గమనార్హం.

More Telugu News