: మూత్రం పోస్తే వారితోనే కడిగించండి: హైదరాబాదీలకు గవర్నర్ నరసింహన్ సూచన

హైదరాబాదులో రోడ్ల పక్కన ఎవరైనా మూత్ర విసర్జన చేస్తే, వారితోనే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయించాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. ‘స్వచ్ఛ హైదరాబాద్’ అని చెప్పి, రెండు బకెట్ల నీరు ఇచ్చి వారి మూత్రాన్ని వారితోనే కడిగించాలని ప్రజలకు ఆయన సలహా ఇచ్చారు. రహదారులపై ఎవరైనా చెత్త వేస్తే దాన్ని కూడా వారిచేతే తీయించినప్పుడు మాత్రమే 'స్వచ్ఛ హైదరాబాద్' కల సాకారమవుతుందని వివరించారు. నిన్న ఖైరతాబాద్ పరిధిలోని ఆనంద్ నగర్ కాలనీలో పర్యటించిన ఆయన వెంకటరమణ కాలనీ, పద్మావతినగర్‌ లలో నెలకొన్న సమస్యల గురించి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఎవరు చేయాల్సిన పని వారు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను గవర్నర్ హెచ్చరించారు.

More Telugu News