: గుడివాడ ఆలయాల భూములను కొడాలి నాని కాజేశారు: టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపణ
వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని), టీడీపీ నేత వర్ల రామయ్య మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త అంశాలతో మీడియా ముందుకు వచ్చే వీరిద్దరు ఆసక్తికర ఆరోపణలతో ప్రత్యర్ధులను ఇరుకునపడేస్తుంటారు. తాజాగా కొడాలి నానిపై వర్ల రామయ్య ఘాటు విమర్శలు చేశారు. గుడివాడలో భీమేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి దేవాలయాలకు చెందిన 300 ఎకరాల భూములను కొడాలి నాని కాజేశారని ఆయన ఆరోపించారు. తన పేరుతో పాటు తన సోదరుల పేర్ల పేరిట ఆలయ భూములను రాయించుకున్న నాని, వాటిని గుట్టుచప్పుడు కాకుండా కాజేశారని రామయ్య ఆరోపించారు.