: శ్రద్ధా కపూర్ డ్యాన్స్ కు ఫిదా అయిపోయిన అలియా భట్

ఒక నటిని మరో నటి ప్రశంసించడం అరుదుగా జరుగుతుంటుంది. అందులోనూ పోటీ ఎక్కువగా వుండే బాలీవుడ్ లో అయితే, ఇంకా అరుదు. అయితే, లేత సోయగాల చిన్నది అలియా భట్ మాత్రం దీనికి భిన్నమనే చెప్పాలి. అందుకు ఉదాహరణగా తాజా సంఘటనను చెప్పుకోవాలి. వరుణ్‌ ధావన్, శ్రద్ధా కపూర్ జంటగా రెమోడిసౌజా దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఏబీసీడి 2’ సినిమాలోని 'సున్ సాథియా' పాటను తాజాగా విడుదల చేశారు. ఈ పాటలో శ్రద్ధా కపూర్ డ్యాన్స్ అద్భుతంగా ఉందని అలియా పొగిడింది. 'చంపేశావ్...శ్రద్ధ' అంటూ ట్వీట్ చేసింది. కాగా, వరుణ్ విషయంలో శ్రద్ధాకు, అలియాకు మధ్య పొసగడం లేదని పుకార్లు షికార్లు చేస్తుండగా, శ్రద్ధా డ్యాన్స్ ను అలియా పొగడడం ఆసక్తి రేపుతోంది. కాగా, డ్యాన్స్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో ప్రభుదేవా కీలకపాత్ర పోషిస్తున్నాడు.

More Telugu News