: రూ. 5,299కే మైక్రోసాఫ్ట్ లుమియా స్మార్ట్ ఫోన్

ప్రఖ్యాతి గాంచిన మైక్రోసాఫ్ట్ సంస్థ 'లుమియా 430' డ్యూయల్ సిమ్ స్మార్ట్ ఫోన్ ను భారత్ లో విడుదల చేసింది. దీని ధర రూ. 5,299 అని మైక్రోసాఫ్ట్ డివైజెస్ డైరెక్టర్ (వెస్ట్) అనంత్ మిట్టల్ తెలిపారు. ఈ ఫోన్ విండోస్ 8.1 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేస్తుంది. ఇందులో 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 128 జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ, 2 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, వీజీఏ సెకండరీ కెమెరా లాంటి ఫీచర్లు ఉన్నాయి. 4 అంగుళాల టచ్ స్క్రీన్ గల ఈ ఫోన్ ను విండోస్ 10కు అప్ గ్రేడ్ చేసుకోవచ్చని మిట్టల్ తెలిపారు.

More Telugu News