: 48వ వసంతంలోకి అడుగుపెట్టిన అందాల నటి
'ఏక్ దో తీన్' పాటతో దేశాన్ని ఉర్రూతలూపి, సినీ అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన అందాల నటి మాధురీ దీక్షిత్ పుట్టిన రోజు నేడు. నేటితో 48వ వసంతంలోకి అడుగుపెట్టిన మాధురి... తన జన్మదిన వేడుకలను కుటుంబసభ్యులతో కలసి జరుపుకుంది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వయసు కేవలం ఒక నెంబర్ మాత్రమే అని... ఏదైనా సాధించడానికి వయసు అడ్డంకి కాదని చెప్పింది. గత సంవత్సరం తనకు ఎంతో ప్రత్యేకమైనదని... తాను స్థాపించిన ఆన్ లైన్ డ్యాన్సింగ్ అకాడమీ సక్సెస్ ఫుల్ గా నడుస్తోందని ఈ సందర్భంగా తెలిపింది. అందరికీ డ్యాన్స్ మెలకువలందించడమే తన లక్ష్యమని మాధురి చెప్పింది.