: రాహుల్ యాత్ర ప్రారంభం... ఆత్మహత్య చేసుకున్న కొరిటికల్ రైతు కుటుంబానికి పరామర్శ
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణలో చేపడుతున్న కిసాన్ సందేశ్ యాత్ర కొద్దిసేపటి క్రితం ఆదిలాబాదు జిల్లా కొరిటికల్ గ్రామంలో ప్రారంభమైంది. నిన్న రాత్రి నిర్మల్ చేరుకున్న రాహుల్ గాంధీ, నేటి ఉదయం అక్కడి నుంచి కారులో కొరిటికల్ గ్రామానికి చేరుకున్నారు. ముందుగా నిర్దేశించుకున్న సమయానికే ఆయన తన పాదయాత్రను ప్రారంభించారు. యాత్రలో భాగంగా ఇటీవల గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు వెల్మ రాజేశ్వర్ కుటుంబాన్ని రాహుల్ పరామర్శించనున్నారు. అంతేకాక బాధిత కుటుంబానికి ఆయన ఆర్థిక సహాయం కూడా చేయనున్నట్లు సమాచారం.