: పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఎర్రచందనం దుంగలు మాయం!

శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం వృక్షాలు దుంగలుగా మారి విదేశాలకు తరలిపోతున్నాయి. ఎర్రచందనం స్మగ్లర్ల విచ్చలవిడి బరితెగింపుతో ఇప్పటికే ఎర్రచందనం చెట్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. అయితే ఇటీవల ఏపీ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎర్రచందనం దుంగల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో స్మగ్లర్లను కటకటాల పాల్జేశారు. దాదాపుగా ఎర్రచందనం అక్రమ రవాణా నిలిచిపోయిందనే చెప్పాలి. అయితే కడప జిల్లా ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి పోలీసులకు గుర్తు తెలియని దుండగులు షాకిచ్చారు. ఇటీవల స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను ఒంటిమిట్ట పోలీసులు స్టేషన్ పరిధిలోనే ఉంచారు. అయితే నిన్న రాత్రి స్టేషన్ ఆవరణలోకి చొరబడ్డ దుండగులు రూ.15 లక్షల విలువ చేసే 19 ఎర్రచందనం దుంగలను ఎత్తుకెళ్లారు. తెల్లవారగానే జరిగిన చోరీని గమనించిన పోలీసులు షాక్ కు గురయ్యారు.

More Telugu News