: ఎవరు గెలవాలని కోరుకోవాలో తెలియడం లేదు:అమితాబ్
ఐపీఎల్ సీజన్-8 లో జరుగుతున్న 51వ మ్యాచ్ లో ఎవరు గెలవాలని కోరుకోవాలో తెలియడం లేదని బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ తెలిపాడు. కోల్ కతా వర్సెస్ ముంబై మ్యాచ్ కు హాజరయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ప్రస్తుతానికి కోల్ కతాకు చెందిన జమాయి బాబునని, అయితే వాస్తవానికి ముంబైకి చెందిన వాడిని కనుక ఈ మ్యాచ్ లో ఎవరు గెలవాలని కోరుకోవాలో తెలియడం లేదని అన్నారు. 'పీకూ' సినిమాలో కోల్ కతాకు చెందిన జమాయిబాబుగా ఆయన నటించారు. ఈ రోజే విడుదలైన ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ముంబై వాసిగా ముంబై ఇండియన్స్ జట్టు గెలిస్తే బాగుంటుందని ఆయన పేర్కొన్నాడు.