: మోదీ, చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన తేదీల్లో కాంగ్రెస్ నిరసనలు
భారత ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం చేసిన మే 26, ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసిన జూన్ 8 తేదీల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ విభాగం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు హైదరాబాదులోని ఇందిరాభవన్ లో జరిగిన పీసీసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఈ కార్యక్రమాల్లో ఎండగట్టాలని కాంగ్ నేతలు నిశ్చయించారు. అలాగే, ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాలని కోరుతూ కోటి సంతకాల పత్రాలను భారత రాష్ట్రపతికి ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి హాజరుకాకపోవడం కొసమెరుపు.