: ప్రేమలో ఉన్నాం...పెళ్లి గురించి చెప్పాలంటే కష్టమే: రణబీర్ కపూర్

బాలీవుడ్ హాట్ కపుల్ రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ల పెళ్లి ఇరకాటంలో పడింది. ఈ ఏడాదే పెళ్లి పీటలెక్కుతారని భావించిన ఈ జంట, ఇప్పుడు పెళ్లిని వాయిదా వేసింది. కారణాలేవైనప్పటికీ, ఈ ఏడాది వివాహం లేదని కత్రినా, రణబీర్ ఇద్దరూ స్పష్టం చేశారు. దీనిపై రణబీర్ మాట్లాడుతూ, పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ముఖ్యమైనదని, అంత ముఖ్యమైన వేడుకపై దాపరికాలు ఎందుకు? అని అన్నాడు. ఈ ఏడాదికైతే తమ వివాహం జరగడం లేదని, వచ్చే ఏటి గురించి చెప్పలేనని రణబీర్ స్పష్టం చేశాడు. కాగా, దీపికా పదుకునేతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన రణబీర్ కపూర్ తరువాత కత్రినాతో ప్రేమలో పడ్డాడు. సల్మాన్ ఖాన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిన కత్రినా కైఫ్ దానికి ముగింపునిచ్చి రణబీర్ తో పెళ్లికి సిద్ధమైంది. అంతలోనే ఇద్దరూ ఈ ఏడాదికి పెళ్లి లేదని స్పష్టం చేయడం విశేషం.

More Telugu News