: తెలంగాణ ఎంసెట్ ప్రారంభం... నిమిషం నిబంధనతో కన్నీటి పర్యంతమవుతున్న విద్యార్థులు

తెలంగాణ ఎంసెట్ పరీక్ష కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఈ పరీక్ష ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు కీలకం. ఇంటర్ తర్వాత తదుపరి కోర్సులను నిర్దేశించే ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 2.32 లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ఇదిలా ఉంటే, నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమన్న నిబంధనను అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాదులోని పలు పరీక్షా కేంద్రాలకు కేవలం నిమిషం వ్యవధి మాత్రమే ఆలస్యంగా వచ్చిన పలువురు విద్యార్థులు గేటు బయటే నిలబడిపోవాల్సి వచ్చింది. విద్యార్థులు ఎంతగా వేడుకున్నా, అధికారులు కనికరించలేదు. దీంతో గేటు వద్దే విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు.

More Telugu News