: బురుండీలో సైనిక తిరుగుబాటు...అధ్యక్షుడ్ని పీకేసినట్టు ప్రకటించిన ఆర్మీ జనరల్
బురుండీలో సైనిక తిరుగుబాటు చోటుచేసుకుంది. రాజ్యాంగ విరుద్ధంగా మూడవసారి అధ్యక్షుడైన పీర్రే కురింజిజాను తొలగిస్తున్నట్టు ఆ దేశ ఆర్మీ జనరల్ నియోంబరే ప్రకటించారు. ఆయన ప్రకటించగానే ఆ దేశ ప్రజలు, సైనికులు వీధుల్లోకి వచ్చి ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ ప్రకటనను అధ్యక్ష కార్యాలయ వర్గాలు ఖండించాయి. దీనిని ఓ జోకుగా భావిస్తున్నామని, ఇది సైనిక తిరుగుబాటు అని భావించడం లేదని అధ్యక్షుని సన్నిహితుడు విల్లీ నియమిత్వే తెలిపారు. కాగా, అధ్యక్షుడు పీర్రే కురింజిజా ఆఫ్రికా సదస్సులో పాల్గొనేందుకు వెళ్లారు.