: రోమ్ మాస్టర్స్ లో క్వార్టర్స్ కు దూసుకెళ్లిన సానియా జోడీ
రోమ్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీ మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. రోమ్ లో జరిగిన మ్యాచ్ లో ఈ ఇండో-స్విస్ ద్వయం 6-4, 6-1తో వరుస సెట్లలో రుమేనియాకు చెందిన ఇరినా, మోనికా జంటను చిత్తు చేసింది. ఈ వరల్డ్ నెంబర్ వన్ జోడీ ఈ పోరులో 7 బ్రేక్ పాయింట్లను గెలుచుకోవడం విశేషం. సానియా, హింగిస్ లకు రుమేనియా అమ్మాయిలు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. రుమేనియా క్రీడాకారిణులు తొలి సెట్ లో కాస్త ప్రతిఘటన కనబర్చినా, రెండో సెట్ లో చేతులెత్తేశారు.