: పాక్ ఘటనపై మోదీ విచారం

పాక్ ఆర్థిక రాజధాని కరాచీలో ఓ బస్సుపై దాడి చేసిన ఉగ్రవాదులు 47 మందిని పొట్టన బెట్టుకున్నారు. ఈ దారుణ ఘటనతో పాకిస్థాన్ ప్రజలు మరోసారి ఉలిక్కిపడ్డారు. భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన మోదీ... దాడిలో గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఆపద సమయంలో పాక్ కు అండగా నిలుస్తామని ట్విట్టర్లో తెలిపారు.

More Telugu News