: యూపీఏ పాలనకు, మోదీ పాలనకు మధ్య తేడా ఏమీ లేదు: బీజేపీ మాజీ సిద్ధాంతకర్త గోవిందాచార్య

బీజేపీ మాజీ సిద్ధాంతకర్తగా గోవిందాచార్యకు పార్టీలో మంచి గుర్తింపు ఉంది. వాజ్ పేయి ప్రభుత్వ హయాంలో ఆయన ఓ వెలుగు వెలిగారు. కాలం మారింది. నేతలు మారారు. పార్టీ వృద్ధ నేతల్లాగే, గోవిందాచార్య కూడా ప్రాభవం కోల్పోయారు. దాదాపు తెరమరుగయ్యారు. తాజాగా ఆయన నిన్న తన పార్టీ నేతృత్వంలో సాగుతున్న నరేంద్ర మోదీ పాలనపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనకు, మోదీ పాలనకు పెద్ద తేడా ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘యూపీఏకి, నేటి మోదీ ప్రభుత్వానికి పాలనలో పెద్ద తేడా లేదు. బీజేపీ అధికారం చేపట్టి ఏడాది గడచినా గొప్ప పనేది ఆచరణలోకి రాలేదు. భూసేకరణ, మేకిన్ ఇండియా వంటి వాటిపై మోదీకి ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు. వారి పట్ల మోదీ కాస్త జాగ్రత్తగా ఉండాలి’’ అని గోవిందాచార్య అన్నారు. ప్రస్తుతం గోవిందాచార్య వ్యాఖ్యలపై అటు ప్రభుత్వంలోనే కాక, ఇటు పార్టీలోనూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

More Telugu News