: భూకంపం ఆ విద్యార్థులను ఆరుబయటే పరీక్షలు రాసేలా చేసింది
నేపాల్ ఎవరెస్టు శిఖరం దగ్గర వచ్చిన భూకంపం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలోని ఓ పాఠశాల విద్యార్థులకు ఎండ రుచి చూపించింది. విద్యా సంవత్సరం షెడ్యూల్ ప్రకారం సిలిగురిలోని ఓ పాఠశాలలో పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా స్కూలుకు చేరుకున్నారు. కాసేపట్లో ఉపాధ్యాయులు పరీక్షలు ప్రారంభిస్తారనగా, కాళ్లకింద భూమి కంపించడం ప్రారంభమైంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు స్కూలు నుంచి పరుగులు తీశారు. ప్రకంపనలు ఆగిపోయినప్పటికీ, ముందు జాగ్రత్త చర్యగా స్కూలు పిల్లలతో ఆరుబయటే పరీక్ష రాయించారు.