: భూసేకరణ బిల్లుపై నిరాహార దీక్షకు సిద్ధం: అన్నా హజారే

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న భూసేకరణ బిల్లు రైతుల కంటే కార్పోరేటర్లకే అనుకూలంగా ఉందని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన భూ సేకరణ బిల్లులో రైతులకు వ్యతిరేకంగా ఉన్న నిబంధనలు తొలగించకుంటే మరో దీక్ష చేపడతానని హెచ్చరించారు. "ఆయన (మోదీ) రైతుల కంటే కార్పోరేట్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు" అని పీటీఐ ఇంటర్వ్యూలో అన్నా ఆరోపించారు. రైతులను రక్షించే విధంగా బిల్లులో ప్రభుత్వం మార్పులు చేయకుంటే దేశవ్యాప్తంగా జైల్ భరో ఉద్యమం చేబడతానని 77 ఏళ్ల హాజారే స్పష్టం చేశారు. రెండవ ప్రత్యామ్నాయంగా 2011లో తాను చేసిన నిరాహార దీక్షను మరోసారి చేస్తానని చెప్పారు.

More Telugu News