: ఆస్ట్రేలియాలో ఉన్నా 'గీత'ను మర్చిపోలేదు!
ఆస్ట్రేలియాలో భారత సంతతి వ్యక్తి డానియల్ మూఖీ (32) ఎంపీగా తన ప్రమాణ స్వీకారం సందర్భంగా పవిత్రమైన భగవద్గీత సాక్షిగా ప్రమాణం చేశారు. న్యూ సౌత్ వేల్స్ కు చెందిన ఈ లేబర్ పార్టీ సభ్యుడి తల్లిదండ్రులు పంజాబ్ ప్రాంతానికి చెందినవారు. మూఖీ పుట్టకముందే వారు ఆస్ట్రేలియా వలస వచ్చారు. బ్లాక్ టౌన్ లో పుట్టిన మూఖీ విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి చూపేవారు.
భగవద్గీత... ప్రపంచంలోని గొప్ప మతపరమైన గ్రంథాల్లో ఒకటని, బైబిల్, ఖురాన్, తోరా వలే ఇది గర్వించదగ్గ గ్రంథమని పేర్కొన్నారు. 'గీత'పై ప్రమాణం చేసిన తొలి ఆస్ట్రేలియా రాజకీయనేతను అయినందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఈ చారిత్రక ప్రమాణ స్వీకారం సందర్భంగా కాస్త ఒత్తిడికి గురయ్యానని మూఖీ తెలిపారు.