: భూకంపంతో బీహార్ లో ఇద్దరి మృతి... యూపీలో భవనం నుంచి పరుగు తీసిన ముఖ్యమంత్రి

భూకంప ప్రభావంతో బీహార్ లో ఇద్దరు చనిపోయినట్టు తెలిసింది. భూప్రకంపనల ధాటికి గోడ కూలడంతో వారు మరణించారని అధికారులు చెప్పారు. మరోవైపు ఈ మధ్యాహ్నం సంభవించిన భూకంపం ఉత్తరప్రదేశ్ లోనూ ప్రభావం చూపింది. ఆ సమయంలో యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ లఖన్ పూర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ప్రకంపనలు రావడంతో ఆయన ఉన్న భవనం నుంచి పరుగు తీశారు. అక్కడున్న నేతలూ, అధికారులు, మిగతావారు కూడా బయటికొచ్చేశారు. అటు చెన్నైలో కూడా స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటికి వచ్చారు.

More Telugu News