: రాణించిన వార్నర్, ధావన్, హెన్రిక్స్... పంజాబ్ లక్ష్యం 186

ఐపీఎల్ సీజన్-8లో భాగంగా హైదరాబాదు, ఉప్పల్ స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న డేవిడ్ వార్నర్ (81) కెప్టెన్ ఇన్నింగ్స్ తో రాణించడంతో హైదరాబాదు ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ధావన్ (24) కూడా ధాటిగా ఆడడంతో ఆరంభంలో భారీ స్కోరు సాధిస్తుందని అంతా భావించారు. ధావన్ ను అద్భుతమైన బంతితో మ్యాక్స్ వెల్ పెవిలియన్ బాటపట్టించడంతో క్రీజులోకి వచ్చిన హెన్రిక్స్ (28) ఆకట్టుకున్నాడు. అనురీత్ సింగ్ పట్టిన అద్భుతమైన క్యాచ్ కి అతను అవుటవ్వడంతో దిగిన మోర్గాన్ (17) ఇన్నింగ్స్ కు జోరు పెంచే క్రమంలో వోహ్రా కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. వెంటనే వార్నర్ పెవిలియన్ చేరగా, తరువాతి బంతికే రన్ అవుట్ గా నమన్ ఓజా (2) వెనుదిరిగాడు. అనంతరం రంగంలోకి దిగిన కేఎల్ రాహుల్ (17), కరణ్ శర్మ (11) మెరుపులతో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. పంజాబ్ జట్టులో హెన్డ్రిక్స్ రెండు వికెట్లతో రాణించగా, అతనికి గుర్ కీరత్ సింగ్, మ్యాక్స్ వెల్ చెరో వికెట్ తో చక్కని సహకారమందించారు. 186 పరుగుల విజయ లక్ష్యంతో పంజాబ్ బ్యాటింగ్ కు దిగింది.

More Telugu News