: తోడు లేరని నిండు గర్భిణిని వెనక్కి పంపారు: యూపీలో వైద్యుల నిర్వాకం

అరాచకాల ఉత్తరప్రదేశ్ లో మాతృదినోత్సవం రోజున నిండుగర్భిణి అనే కనికరం లేకుండా వైద్యులు ప్రవర్తించారు. యూపీలోని సీతాపూర్ కు చెందిన గీతాదేవి పురుటి నొప్పులతో ఒంటరిగా ఆసుపత్రికి వెళ్లింది. నొప్పులు వస్తున్నాయని, ఆసుపత్రిలో చేర్చుకోవాలని కోరింది. తోడుగా ఎవర్ని తెచ్చుకున్నారని ఆసుపత్రి సిబ్బంది ఆమెను ప్రశ్నించారు. సంబంధితులు లేకుంటే ఆసుపత్రిలో చేర్చుకోమంటూ సిబ్బంది ఆమెను తిప్పిపంపేశారు. ఫలితంగా ఆమె నడిరోడ్డుపై స్థానికుల సాయంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, తిరిగి ఆమెను ఆసుపత్రిలో చేర్చుకున్నారు. దీనిపై ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ కు ఫిర్యాదు చేయడంతో ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

More Telugu News